Receive all updates via Facebook, Just Click the Like Button Below

By Making Different | Get This !

అతిలోక సుందరిపై బిగ్ బి ప్రశంసలు

అతిలోక సుందరిపై బిగ్ బి ప్రశంసలు


ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన హీరోయిన్ గా హల్ చల్ చేసిన శ్రీదేవి వివాహం తరువాత సినిమాలకు దూరంగా జరిగింది. అయితే సుదీర్ఘ కాలం విరామం తరువాత శ్రీదేవి ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల అవుతుంది.

హిందీతో పాటు, తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ  ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా విడుదల అవుతుంది.  కాగా, ఈ సినిమా స్పెషల్ షో ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వీక్షించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మనసుకి హత్తుకుపోయేలా ఉన్నాయని, శ్రీదేవి నటన హృదయానికి తాకేలా ఉందని ప్రశంసించారు.

ఓ సూపర్ హిట్ తో శ్రీదేవి తన రెండవ ఇన్నింగ్స్ ను ఆరంభించడం ఖాయమని బిగ్ బి తెలిపారు.
Tag : MovieNews

Related Post:

0 Komentar untuk "అతిలోక సుందరిపై బిగ్ బి ప్రశంసలు"

Back To Top